తిరుపతి ఎస్వీ జూపార్క్ టైమ్ స్కైల్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ... సెల్ఫీ వీడియో

ఠాగూర్

గురువారం, 9 అక్టోబరు 2025 (10:48 IST)
తిరుపతి ఎస్వీ జూపార్క్ టైమ్ స్కేల్ ఉద్యోగి ఏబీవో హరిబాబు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి జూపార్క్ రేంజర్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు అందులో పేర్కొన్నాడు. ఈ పనికిపాల్పడే ముందు ఒక సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడు. 
 
జూపార్కులో చేసిన పనులకు రావాల్సిన బిల్లుల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్యకు చెందిన బంగారు నగలను రూ.11 లక్షలకు తాకట్టుపెట్టి మరీ పనులు పూర్తి చేశానని, తనకు మొత్తంగా రూ.25 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి వుందని, ఆ బిల్లులు చెల్లించాలని అడిగితే వేధిస్తున్నారని, వీటిని భరించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ సెల్ఫీ వీడియోలో హరిబాబు పేర్కొన్నాడు. కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్వీ జూపార్క్ డైరెక్టర్ సెల్వం తక్షణం స్పందించి విచారణకు ఆదేశించారు. 

 

షాకింగ్ ఘ‌ట‌న‌

తిరుప‌తి ఎస్వీ జూపార్క్ టైం స్కేల్ ఉద్యోగి ఏ.బి.ఓ. హరిబాబు ఆత్మహత్యాయత్నం

జూపార్క్ లో రేంజర్ వేధింపులే వల్లే ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల

జూపార్క్ లో చేసిన పనులకు రావాల్సిన బిల్లులు విషయంలో జాప్యం చేస్తున్నార‌ని ఆవేద‌న

రూ.11 లక్షలకు… pic.twitter.com/BoCzvWuHeB

— Telugu Feed (@Telugufeedsite) October 9, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు