కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఇంటర్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. జూన్ 12 శుక్రవారం ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ల పరీక్షల ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫలితాలను శుక్రవారం మధ్యాహ్నం 12.30 తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించనున్నారు.
కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆలస్యమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఇంటర్ బోర్డు అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. దీనితో శుక్రవారం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేయనుంది. మార్చి 4 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరిగిన సంగతి విదితమే. కాగా, ఏపీలో పదో తరగతి పరీక్షలు జులై 10 నుంచి 15వ తేదీ వరకూ జరగనున్నాయి.
ఇకపోతే.. విద్యార్థులు ఫలితాలను హాల్‌టికెట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా https://bie.ap.gov.in/ తోపాటు ఇతర వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. మార్చి 25 నుంచి దేశంలో లాక్ డౌన్ అమలు చేయడంతో ప్రశ్నపత్రాల వ్యాల్యూయేషన్ కాస్త ఆలస్యం అయ్యింది. లాక్ డౌన్ అమలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాల్యువేషన్ నిర్వహించిన అధికారులు ఫలితాల విడుదలకు సిద్ధం అయ్యారు.