ఏపీకి చెందిన 11,602 శాంపిళ్లను పరిశీలించగా 135 మందికి పాజిటివ్ అని తేలింది. కాగా 65 మంది కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు.
ఏపీలో నమోదైన మొత్తం 4,261 పాజిటివ్ కేసులకు గాను 2,540 మంది డిశ్చార్జ్ అవగా.. 80 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,641 మంది కరోనా కారణంగా చికిత్స పొందుతున్నారు.