బందర్ రోడ్ లో దర్జాగా ట్రాఫిక్ ఉల్లంఘనలు

శనివారం, 25 డిశెంబరు 2021 (18:04 IST)
విజ‌య‌వాడ‌లోని బందర్ రోడ్డులో ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు.  లబ్బీపేట నుండి రోడ్డుకి ఇరువైపు షాపుల ముందు వాహనాలు అడ్డంగా బారులు తీరుతూ, పార్కింగ్ చేస్తున్నారు.


నో పార్కింగ్ బోర్డులు పెట్టినా లేక్క చేయకుండా వాహనాలు పార్కింగ్ చేయడంతో లబ్బీపేట వద్జ బందర్ రోడ్ పై ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. పివివి వద్ద, టిప్సి టాప్సి వద్ద కారులు, టువీలర్స్ రోడ్డు మీదే పార్కింగ్ చేయడంతో అక్కడ వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. అక్కడే ఉన్న పోలీస్ బీట్ ఉన్న చూసి చూడనట్లు వ్యవరించడం గమనార్హం. 
 
 
ఓక్కోసారి ప్రాణాపాయంలో ఉన్న పెషేంట్లను అంబులెన్సులలో తీసుకెళ్ళటప్పుడు ట్రాఫిక్ వల్ల‌ పేషెంట్లకు ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంటోంది. అంతేకాక‌ పుట్ పాత్ లను సైతం దర్జాగా అక్రమించి కొంద‌రు వ్యాపారులు పాదాచారులు నడవకుండ తాళ్ళను క‌డుతున్నారు. కొంద‌రైతే ద‌ర్జాగా నో పార్కింగ్ బోర్డులను ఉంచుతున్నారు. ఇప్ప‌టికైనా ట్రాఫిక్ పోలీసులు బంద‌రు రోడ్డులో ఉల్లంఘ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌పుడు క్లియ‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు