177 టిటిడి క‌ల్యాణ మండ‌పాలు... లీజుకు సిద్ధం!

సోమవారం, 30 ఆగస్టు 2021 (11:59 IST)
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం త‌న ఆర్ధిక వ‌న‌రుల‌ను మ‌రింత పెంచుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే టిటిడి దేశంలోనే అతి పెద్ద హిందూ దేవాల‌యంగా, అత్య‌ధిక ఆదాయం వ‌చ్చే దేవ‌స్థానంగా పేరొందింది. ఇపుడు ఆ సంస్థ‌కు ఉన్న వ‌న‌రులు అన్నింటినీ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని టి.టి.డి. నిర్ణ‌యించింది. 
 
రెండు తెలుగు రాష్ట్రాల్లోని 177 కల్యాణ మండపాల నిర్వహణను లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. హిందూ సంస్థలకు, ఆలయాలకు, మఠాలకు, ట్రస్టులకు, హిందు మతానికి చెందిన వ్యక్తులకు ఈ క‌ల్యాణ మండ‌పాల‌ను ఐదేళ్లపాటు లీజుకు ఇవ్వనున్నట్టు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇతర వివరాలకు ‘తిరుమల.ఆర్గ్‌’, ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌ జీవోవీ.ఇన్‌’లో చూడాలని పేర్కొంది.

కాగా, చిత్తూరు జిల్లాలోని 14 కల్యాణ మండపాలను లీజుకు ఇవ్వనున్నట్టు బుధవారమే ప్రకటించింది. ఆసక్తిగల వారు త‌మ  ప్రతిపాదనలను ‘టెండర్‌.ఏపీఈ ప్రొక్యూర్‌మెంట్‌.జీవోవీ.ఇన్‌’ వెబ్‌సైట్‌లో సమర్పించాలని సూచించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు