14 కళ్యాణ మండపాలు లీజుకు: టీటీడీ నిర్ణయం

గురువారం, 26 ఆగస్టు 2021 (08:18 IST)
చిత్తూరు జిల్లాలోని 14 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది.

ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు సెప్టెంబరు  1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సెప్టెంబరు 30వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా www.tender.apeprocuerment.gov.in కు వారి ప్రతిపాదనలు సమర్పించవచ్చు.

జిల్లాలోని గుడిపాల, పొలకల, పలమనేరు, కల్లూరు, పుంగనూరు, సదుం, సోమల, రొంపిచెర్ల, భాకరాపేట,తరిగొండ, పుత్తూరు, బలిజకండ్రిగ, తిరుమలరాజ పురం, తొండమనాడు కళ్యాణ మండపాలు టీటీడీ లీజుకు ఇవ్వనుంది.

ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tender.apeprocurment. gov.in లేదా 08772264174,
0877 22641745ఫోన్ లో సంప్రదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు