టీటీడీ సంచలన నిర్ణయం.. సర్వదర్శనానికి ఆధార్ చూపిస్తే చాలు: బుచ్చయ్య ఏమంటున్నారో చూడండి

మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:25 IST)
సర్వదర్శనం కోసం ఇక టోకెన్లు అవసరం లేదు.. ఆధార్ చూపిస్తే చాలు.. అంటోంది టీటీడీ. కలియుగ వైకుంఠం సర్వదర్శనం టోకెన్ల కోసం జనం భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనాయి. ఈ నేపథ్యంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఈ మేరకు టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. భక్తులు ఆధారా కార్డ్ చూపించి సర్వ దర్శనానికి వెళ్ళిపోవచ్చని టీటీడీ ప్రకటించింది. 
 
మంగళవారం రోజు విడుదల చేసే సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్దవేల సంఖ్యలో భక్తులు వచ్చారు. 
 
Koo App
ఇది దుస్థితి.. తిరుమల లో దర్శన భాగ్యం కూడా ఈ నిచమైన ప్రభుత్వం కల్పించలేక పోతుంది. వేసవి దృష్ట్యా కనీస చర్యలు కూడా టిటిడి చేపట్టలేకపోతుంది. హృదయ విధారక చర్యలు చూస్తున్నాం. #గోరంట్ల #FailedCMjagan - Gorantla Butchiah Choudary (@GORANTLA_BC) 12 Apr 2022
ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలోనే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసి భక్తులను దర్శనానికి తితిదే అనుమతించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు