వైకాపాలో చేరనున్న ఉండవల్లి అరుణ్ కుమార్... ఏ క్షణమైనా తీర్థం...

సోమవారం, 29 ఆగస్టు 2016 (13:48 IST)
ఏపీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇఁదుకోసం ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
వాస్తవానికి వైయస్‌కు కూడా ఉండవల్లి అత్యంత సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బంధాన్ని కొనసాగిస్తూ జగన్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు ఉండవల్లి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వైసీపీ ఆఫీస్‌లో ఉండవల్లి ప్రెస్‌మీట్ పెట్టే తరుణం తొందర్లోనే ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
దీనికితోడు గత కొద్దిరోజులుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసేందుకే ఉండవల్లి ప్రెస్‌మీట్ పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షానికి మద్ధతుగా ఉన్నాడన్న నమ్మకాన్ని కలిగించేందుకే ఉండవల్లి ఇలా విమర్శలు చేస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి