20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం, జనసేన రాష్ట్ర కార్యాలయం పరిసర ప్రాంతాలలో 20 నిమిషాల పాటు డ్రోన్ చక్కర్లు కొట్టినట్టు సమాచారం అందుతోంది. దీనిపై ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ, మంగళగిరి డిఎస్పి మురళీకృష్ణ, సిఐలు ఎస్సైలు సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మరింత భద్రత కట్టుదిట్టం చేయాలని పీకే ఫ్యాన్స్ కూటమి ప్రభుత్వాన్ని, హోం మంత్రి అనితను కోరుతున్నారు. ఇంకా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్‌జీ అండ్ కౌంటర్ యాక్షన్ టీమ్‌తో ఆయనకు భద్రత పెంచాలని కోరుతున్నామని జనసేన, పీకే ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.