ఏ దేవుడు చెప్పులు లేకుండా నడిచాడో బ్రాహ్మణులు చెప్పాలి: ఐలయ్య

గురువారం, 5 అక్టోబరు 2017 (21:40 IST)
సామాజికవేత్త, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఓయూలో ప్రసంగిస్తూ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అగ్రకులాల వారిని టార్గెట్ చేశారు. అగ్రకులాల అహంకారంపై పుస్తకాలు రాస్తుంటే విదేశీ ఏజెంట్ అంటున్నారని ఫైర్ అయ్యారు. హైద‌రాబాద్ తార్నాక‌లోని ఓయూలో నిర్వ‌హించిన ఇండియ‌న్ ఇంగ్లిష్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఐలయ్య ఉద్వేగభ‌రిత ప్ర‌సంగం చేశారు. కిందికులాల వారికి బ్రాహ్మ‌ణులు, కోమ‌ట్ల కంటే వంద‌రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంటుంద‌న్నారు.
 
తాను ఎన్న‌డూ వైశ్య స్త్రీల‌ను తిట్ట‌లేదని, కానీ వైశ్య స్త్రీలు ఏది నిజ‌మో తెలుసుకోకుండా తాను రాసిన పుస్త‌కంపై నిర‌స‌న తెలుపుతున్నార‌ని ఐలయ్య వెల్లడించారు. ఇది ద్ర‌విడ దేశం అని, ఆవు దేశం కాద‌ని ఐల‌య్య వ్యంగ్యంగా అన్నారు. ఏ దేవుడు చెప్పులు లేకుండా న‌డిచాడో బ్రాహ్మ‌ణులు చెప్పాల‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. కిందికులాల వారు చేసే చెప్పులు లేనిదే అగ్ర‌కులాల వారు కాలు బ‌య‌ట పెట్ట‌బోర‌న్నారు. వైశ్యులు, బ్రాహ్మ‌ణులు త‌న‌ను క్రిస్టియ‌న్ అంటూ అబ‌ద్ధ‌పు ప్ర‌చారం చేస్తున్నారన్నారు. 
 
సరిహద్దుల్లో నిలబడి కింది కులాల వారు దేశాన్ని రక్షిస్తుంటే.. కింది కులాల వారికి తెలివిలేదని, మంచోళ్లు కాద‌ని అగ్ర‌కులాల వారు ఎన్నో మాట‌లు మాట్లాడార‌ని ఐలయ్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలంతా స‌రిహ‌ద్దుల్లో నిల‌బ‌డి చైనా దుర‌హంకారాన్ని గీత దాటి రాకుండా కాపాడుతున్నార‌ని ఐలయ్య చెప్పారు. వారివ‌ల్లే దేశం సుర‌క్షితంగా ఉంద‌ని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు