తొక్కిసలాట మృతులకు ఉయ్యూరు ట్రస్ట్ రూ.20 లక్షల సాయం

సోమవారం, 2 జనవరి 2023 (08:50 IST)
గుంటూరులో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ నిర్వహించిన చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రమాదేవి అనే మహిళ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, రాజ్యలక్ష్మి, సయ్యద్ అసిమా అనే మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
ఈ నేపథ్యంలో ఉయ్యూరు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస రావు స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యుల బాగోగులు చూసుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు కూడా తామే భరిస్తామని తెలిపారు. 
 
మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం కలచివేసిందని చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. తొక్కిసలటా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. 
 
మరోవైపు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి విడుదల రజని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలక నుంచి వివరాలు తెలుసుకున్నారు. వైకాపా ఎమ్మెల్యే ముస్తాఫా, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కూడా బాధితులను పరామర్శించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు