దీనిపై వంగవీటి రాధా స్పందించారు. తాను నిత్యం ప్రజలతో ఉండే వ్యక్తినని, ప్రభుత్వం గన్‌మెన్లు వద్దని చెప్పానని చెప్పారు. తనకు ప్రజలు, అభిమానులే రక్షణ అని స్పష్టంచేశారు.
అదేసమయంలో తనను పోలీసులు తనను సంప్రదిస్తే పూర్తి సమాచారం అందిస్తానని, పోలీసులకు కూడా పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలంటే రెక్కీకి సంబంధించి తన వద్ద కంటే పోలీసుల వద్దే పూర్తి సమాచారం ఉందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు.