తన హత్యకు కుట్రపన్నుతున్నారనీ, ఇందుకోసం రెక్కీ కూడా నిర్వహించారంటూ తన తండ్రి వంగవీటి మోహనరంగా వర్థంతి వేడుకల్లో వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో ఏపీ మంత్రి కొడాలి నానితో పాటు.. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు కూడా వేదికపైనే ఉన్నారు.
ఆ తర్వాత ఈ అంశాన్ని మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై జగన్ వెంటనే స్పందించి రాధాకు భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ విషయాన్ని కొడాలి నాని స్వయంగా వెల్లడించారు. అలాగే, రాధా హత్యకు రెక్కీ నిర్వహించిదెవరో నిగ్గు తేల్చాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించారని మంత్రి నాని వెల్లడించారు.