పాతవాహనాలు విక్రయించే సమయంలో వాహన యజమానులు వాహన బదిలీల ఫారాలపై భౌతికంగా సంతకం చేసినా కూడా ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో యజమాని తప్పనిసరి కావడంతో అందుబాటులో లేని వాహన యజమానుల వాహనాల లావాదేవీలు ఆగిపోవడం జరిగాయని, అటువంటి వాహనాల బదిలీలను పాతవిధానం (3టైర్ సాఫ్ట్‌వెర్)లో అనుమతించడం జరుగుతుందని, డిటీసీ ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు.
గతంలో వాహనాలపై తీసుకున్న ఫైనాన్స్ కు సంబంధించిన మొత్తం రుసుమును చెల్లించి, ఫైనాన్సర్ నుండి ఫారం 35, కవరింగ్ లెటర్లపై సంతకాలు చేసినవి, సంతకంలు చేసిన కూడ ఫైనాన్సర్ లు అందుబాటులో లేకపోవడం లేదా ఫైనాన్స్ కంపెనీలు ఎత్తివేయడం వంటి వాటిని గమనించి పాతవిధానం 3టైర్ సాఫ్ట్ వెర్ లో లావాదేవీలు జరుపుకోనే విధంగా వారం రోజులపాటు అవకాశం కల్పించామని అన్నారు.
ఒక ఆర్టిఏ కార్యాలయం నుండి వేరొక ఆర్టీఏ కార్యాలయంనకు క్లియరెన్స్ సర్టిఫికెట్ లు పొంది, బదిలీల నిమిత్తం ఫారం 29,30లపై సంతకం చేసినటు వంటివి కూడా పాత విధానం 3టైర్ సాఫ్ట్ వెర్ లో వాహన లావాదేవీలు జరుపుకోవచ్చని ఆయన తెలిపారు.