ఆఖరి కుక్క కూడా తృప్తిగా తోక ఆడించాలి... ఉపరాష్ట్రపతి వెంకయ్య(వీడియో)

శనివారం, 26 ఆగస్టు 2017 (14:45 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనమైన పౌర సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... ''ఐయామ్ రిటైర్డ్ ఫ్రమ్ పాలిటిక్స్.. బట్ నాట్ టైర్డ్. 2019 సంవత్సరంలో రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగి సమాజసేవలో గడపాలనుకున్నాను. మా సొంతూరులో సంక్రాంతి పండుగ జరుపుకోవాలనుకున్నాను. నా బలహీనత ప్రజలతో గడపడమే. 
 
ప్రజల్లో వుండే అసమానతలను తొలగించాలి. స్వామి వివేకానంద అన్నట్లు... ఆఖరి కుక్క కూడా తృప్తిగా తోక ఆడించాలి. అలాగే ప్రతి మనిషి ఆనందంతో తృప్తితో జీవితం గడపాలి. అసమానతలు తొలగాలి. ఆకలి, కుల మతాల అసమానతలు పారదోలాలి. మనం చీమకు చెక్కర పెడతాం. పాముకు పాలు పోస్తాం, అది కాటేస్తుందని తెలిసినా... చెట్టుకు బొట్టు పెడతాం, పశువుకు పసుపు, కుంకుమలు పెడ్తాం. ఇవి మన గొప్ప సాంప్రదాయాలను తెలియజేస్తాయి. 
 
నాకు దక్కిన ఈ ఉన్నత పదవి కారణంగా భవిష్యత్తులో ఎక్కువగా మీతో మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అయినా తెలుగు ప్రజల కష్టనష్టాలు నాకు బాగా తెలుసు. అందుకోసం నావంతు కృషి నేను చేస్తాను. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతి సమస్యపై కూర్చుని మాట్లాడుకోవాలి" అని సందేశమిచ్చారు. ఇంకా ఆయన ప్రసంగాన్ని ఈ దిగువ వీడియోలో చూడవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు