గుంటూరులో విజిలెన్స్ దాడులు.. భారీగా ఎరువుల నిల్వలు స్వాధీనం

బుధవారం, 7 ఆగస్టు 2019 (12:17 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ పంటలకు సంబంధించి ఎరువుల కొరత నెలకొనడంపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లాలోని పలు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1,193 ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఎరువుల బస్తాలను అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించినందుకు షాపుల యజమానులపై కేసులు నమోదుచేశారు. 
 
కాగా, ఈ ఎరువుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.11.50 లక్షలు ఉంటుందని ఓ విజిలెన్స్ అధికారి తెలిపారు. ఈ ఎరువుల బస్తాలను అనధికారిక ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారనీ, రైతులకు బిల్లులు కూడా ఇవ్వడం లేదని తమ తనిఖీలో తేలినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రికార్డుల్లో ఉన్న ఎరువుల నిల్వలకు, వాస్తవ నిల్వలకు అసలు పొంతనే లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు