విజయవాడ నగరంలోని రామవరప్పాడులో ఒక కుటుంబం ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ కుటుంబంలో 24 యేళ్ల యువతి ఉంది. అలాగే, ఇంటి యజమానికి రాఘవేంద్ర అనే కుమారుడు ఉన్నాడు. ఈ యువకుడు ఆ యువతిపై కన్నేశాడు. ఆ తర్వాత ఆ యువతిని మాటలతో మాయచేసి.. యేడాది కాలంగా శారీరకంగా కలుస్తూ వచ్చాడు.
తమ కలయికను రహస్యంగా వీడియో తీసి... తన స్నేహితులకు చూపిస్తూ వచ్చాడు. ఒక రోజున ఆ స్నేహితులు ఈ వీడియో క్లిప్పింగ్స్‌ను తమ ఫోన్లలో ఎక్కించుకుని, ఆయువతిని బెదిరించ సాగారు. తమకు కూడా శారీరక సుఖం పంచాలని, డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయం తెలుసుకున్న నిందితులు పరారయ్యారు.