నెలాఖ‌ర్లో రిటైర్ అవుతున్నా... సీఎం జ‌గ‌న్ కి కృత‌జ్ణ్న‌త‌లు!

శుక్రవారం, 26 నవంబరు 2021 (18:37 IST)
విజయవాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బి. శ్రీనివాసులు తాను ఈనెల 30న రిటైర్డ్ అవుతున్నాన‌ని తెలిపారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు చెప్పారు. తాను విజయవాడలో ఏసీపీగా, అడిషనల్ సీపీగా పని చేసాన‌ని, సీపీగా రెండుసార్లు పనిచేశాన‌ని తెలిపారు. తాను నాలుగు వేల మంది సిబ్బందితో కలిసి పని చేసాన‌ని, డీజీపీకి, త‌న సహచరులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
 
ఇటీవ‌ల జ‌రిగిన ఫేక్ ఎఫ్డీల వ్యవహారం హైదరాబాదులో ప్రారంభమై విజయవాడకు చేరాయ‌ని, దీనిపై ఆత్కూర్, భవానీపురంలలో కేసులు నమోదయ్యాయ‌ని సీపీ శ్రీనివాసులు వివ‌రించారు. కొత్త వ్యక్తులు చాలామంది బయటపడ్డార‌ని, ఏడుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసార‌ని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఎనిమిది మందిని పీటీ వారెంట్ పై తీసుకొచ్చామ‌ని, దాదాపు 2 కోట్లు సొమ్ము రికవరీ చేసామ‌ని చెప్పారు. 2.57 కోట్ల ఆస్తులను సీజ్ చేసి, కోర్టుకు అందజేసామ‌ని, 11.4 కోట్లు కొత్త మోసం చేసేందుకు ఫేక్ ఎఫ్డీలు తయారు చేసార‌ని వివ‌రించారు.


వరుస పరిశోధనలతో 11.4 కోట్ల ప్రభుత్వ సొమ్ము మోసం జరగకుండా తాము ఆపామ‌ని, ఇంకా 8 కోట్ల సొమ్ము రికవరీ కావల్సి ఉంద‌న్నారు. బ్యాంకులలో సిబ్బంది, మేనేజర్లు, బ్రోకర్లు ఈ మోసాలకు పాల్పడుతున్నార‌ని, లోన్ల ముసుగులో డిపాజిట్ల దందా జరుగుతోంద‌ని చెప్పారు. వచ్చిన సొమ్ములను హవాలా కోసం కూడా ఎఫ్డీ నేరస్థులు వినియోగించార‌ని సీపీ శ్రీనివాసులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు