తాడేపల్లిలో నర్సుపై ప్రేమోన్మాది బ్లేడుతో దాడి చేశాడు. నర్సుగా పనిచేస్తున్న ఇరవై మూడేళ్ల మహిళపై ఓ ప్రేమోన్మాది చేసిన ఈ బ్లేడ్ దాడి స్థానికంగా కలకలం రేపింది. వడ్డేశ్వరంలోని హాస్టల్ సమీపంలో దుండగుడు ఆమెపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లాకు చెందిన యువతి గత మూడేళ్లుగా ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తోంది. కాలేజీ హాస్టల్‌లో ఉంటూ విధులకు హాజరవుతోంది. ఆదివారం, చర్చి నుండి తిరిగి హాస్టల్‌కి వస్తుండగా క్రాంతి మౌళి అనే యువకుడు ఆమెతో మాట్లాడాలని కోరాడు. ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. పెళ్లి చేసుకుందామని అడిగాడు.