ప్రజల వద్దకే పాలన కోసం ఏపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలో వలంటీర్లను నియమించింది. వీరి ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రభుత్వం చేరవేస్తుంది. అయితే, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారి వివరాలను సేకరించాలంటూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసి ఓ సర్వే పత్రాన్ని వలంటీర్లకు అందజేసింది. దీన్ని ఓ వలంటీరు కాల్చివేసి, దానిని వీడియో తీసి అధికారులు, వలంటీర్లు ఉండే వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు.
బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలు గ్రామంలో వలంటీర్‌గా పనిచేస్తున్న బాషా ఈ విధంగా చేసిన వినూత్న నిరసనకు దిగారు. తమతో గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని, అందుకే తమలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ సర్వే పత్రాన్ని వలంటీర్లకు పంపింది. ఈ సర్వేపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాషా... ఆ సర్వే పత్రాన్ని కాల్చేశారు. కాలుతున్న సర్వే పత్రాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సహచర వలంటీర్లతో పాటు అధికారులు ఉండే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.