విశాఖ విద్యార్థినికి అరుదైన గౌరవం.. ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం

ఠాగూర్

సోమవారం, 12 ఆగస్టు 2024 (08:29 IST)
విశాఖపట్టణానికి చెందిన ఓ విద్యార్థినికి అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం వచ్చింది. విశాఖ సాగర్ నగర్ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థిని జయలిఖితకు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే 78వ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆమెకు ఆహ్వానం అందింది. యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ప్రతి యేటా ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్రం విద్యార్థులకు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. 
 
దీనికోసం మై భారత్ పేరుతో పోర్టల్ ఏర్పాటు చేసింది. ఆయా కేటగిరీల విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఏ యేడాది దేశ వ్యాప్తంగా ఎన్‌‌వైకే విభాగంలో వేలాది మంది దరఖాస్తు చేసుకోగా, 68 మందిని ఎంపిక చేశారు. వీరిలో విశాఖకు చెందిన జయలిఖిత ఒకరు కావడం గమనార్హం.
 
సామాజిక సేవా కార్యక్రమాలు, విభిన్న అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, నెహ్రూ యువ కేంద్రం నిర్వహించే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జయలిఖితకు అవకాశం కల్పించింది. తనకు దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం లభించడం పట్ల జయలిఖిత హర్యం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు