ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం...

శుక్రవారం, 26 ఆగస్టు 2022 (14:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్లీలను నిషేధించింది. దీంతో ఇకపై కేవలం గుడ్డతో తయారుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు మాత్రమే వినియోగించాల్సివుంటుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 
 
ఆయన శుక్రవారం విశాఖలో పర్యటించారు. విశాఖలోని ఏయూ కన్వెన్షన్ సెంటరులో పార్లే ఫర్ ది ఓషన్స్ అనే సంస్థతో ఒక ఒప్పందాన్ని ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా ఆయన చెప్పారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామని తెలిపారు. 
 
విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ జరిగిందన్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్ వ్యవర్థాలను సముద్రం నుంచి తొలగించామని చెప్పారు. సముద్రాన్ని, ఏపీ తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. 
 
పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యవర్థాలను బయటకు తీస్తుందని, వీటిని రీ సైక్లింగ్ చేసి పలు ఉత్పత్తులను ప్రభుత్వం తయారు చేస్తుందన్నారు. పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు