Rajiv Kanakala: రూపాయి ఎక్కువ తీసుకున్నా నా విలువ పడిపోతుంది :రాజీవ్ కనకాల

దేవీ

గురువారం, 21 ఆగస్టు 2025 (10:35 IST)
Shiva Kandukuri, Teju, Rajeev Kanakala, Raj Kandukuri
శివ కందుకూరి హీరోగా ‘చాయ్ వాలా’ అనే చిత్రాన్ని హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా విజయలక్ష్మి, వెంకట్ ఆర్. పాపుడిప్పు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రమోద్ హర్ష రచన, దర్శకత్వం వహించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. 
 
‘నా చాయ్ విలువ రూ. 15.. అంతకన్న ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. నా విలువ పడిపోతుంది’ అంటూ రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్‌తో టీజర్ అద్భుతంగా ఆరంభమైంది. ‘ప్రతీ పేజీలో కల్కి స్టోరీ రాస్తే పాసైపోతామని తెలిస్తే.. ఎప్పుడో పాస్ అయ్యే వాళ్లం కదరా’ అంటూ శివ కందుకూరి చెప్పిన డైలాగ్.. ఆ తరువాత తండ్రీ కొడుకుల మధ్య సీన్లు, లవ్ స్టోరీకి సంబంధించిన ట్రాక్ ఇలా అన్నింటిని చూస్తే ‘చాయ్ వాలా’ యూత్, ఫ్యామిలీకి సంబంధించిన అన్ని అంశాలను జోడించినట్టుగా అనిపిస్తుంది.
 
రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ప్రమోద్ హర్ష నాకు ‘ఉంగరాల రాంబాబు’ టైంలో పరిచయం. ప్రమోద్ చెప్పిన కథ విని ఆశ్చర్యపోయాను. ‘చాయ్ వాలా’ కథ నాకు చాలా నచ్చింది. ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటూనే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతీ సీన్‌ను ఎంతో వివరించి నటీనటుల నుంచి నటనను రాబట్టుకునేవాడు. రాజ్ కందుకూరి గారు ఈ సినిమా మీద మా అందరి కంటే ఎక్కువ నమ్మకంగా ఉండేవారు. కొడుకు కోసం ఆయన ఎంతో చేస్తుంటారు. ‘చాయ్ వాలా’ని ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. శివ కందుకూరి బోలెడంత ఆకలితో ఉన్న ఆర్టిస్ట్. నా పక్కన ఎక్కడా తగ్గకుండా ఉండాలని ఎంతో తపన పడి నటించేవాడు. ఆ ఆకలితో ఉన్న శివ కందుకూరి ఎంతో ఎత్తుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ‘చాయ్ వాలా’ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
 
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ,  రెండేళ్ల క్రితం కథ చెప్పినప్పుడే రాజీవ్ కనకాల తండ్రి పాత్రను పోషించిస్తారని డైరెక్టర్ ప్రమోద్ చెప్పారు. ఇమ్రాన్ రైటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. తేజు అశ్వినికి తెలుగులో చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ప్రమోద్ రాసిన మంచి కథకు, మంచి నటీనటులు కలిసి వచ్చారు. శివకు సురేష్ బనిసెట్టి మంచి పాటల్ని రాస్తుంటారు. శివ స్నేహితుడిగా ఇందులో కసిరెడ్డి చాలా చక్కగా నటించారు. ఈ మూవీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.
 
శివ కందుకూరి మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని చూసిన తరువాత తండ్రితో కాసేపు మాట్లాడతారు. థియేటర్ నుంచి ఓ మంచి ఎమోషన్‌తోనే బయటకు వస్తారని మాత్రం కచ్చితంగా చెప్పగలను. మా ‘చాయ్ వాలా’ చిత్రం త్వరలోనే థియేటర్లోకి రానుంది. అందరినీ ఆకట్టుకునేలా మా మూవీ ఉంటుంది’ అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు