బిజెపి నేతలపై దాడులు చేయించాల్సిన అవసరం మాకు లేదు: హోంమంత్రి

గురువారం, 7 జనవరి 2021 (23:25 IST)
బిజెపి నేతలపై ఫైరయ్యారు హోంమంత్రి మేకపాటి సుచరిత. బిజెపి నేతలపై దాడులు చేయించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఛలో రామతీర్థం పేరుతో అవనవసరంగా ప్రతిపక్షపార్టీలు రార్థాంతం చేస్తున్నాయన్నారు. రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతిలో ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్లో పాల్గొన్న హోంమంత్రి మేకపాటి సుచరిత ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
 
పోలీస్ డ్యూటీ మీట్లో క్రీడలు, క్విజ్ పోటీల్లో పాల్గొని గెలుపొందిన విజేతలకు బహుమతులను హోంమంత్రి అందజేశారు. ఇగ్నైట్ అంటే స్ఫూర్తిని రగిలించేదని చెప్పారు. పోలీసుల ప్రతిభను వెలికి తీసేందుకు పోలీస్ డ్యూటీ మీట్ను నిర్వహించినట్లు చెప్పారు. పోలీస్, జైళ్లు, కోర్టుల వ్యవస్ధలు సాంకేతికంగా అనుసంధానం కావాలన్నారు.
 
గతంలో పోలిస్తే నేరాల సంఖ్య 15 శాతం తగ్గాయని.. విచారణ పూర్తి చేసి 58 రోజుల్లోనే ఛార్జ్ షీట్ నమోదు చేస్తుందని చెప్పారు. దిశా పోలీస్టేషన్లకు ఐఎస్ ఓ గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. 87 సేవలను పోలీస్ సేవా యాప్‌తో అందిస్తున్నామని.. నేరాల స్వరూపంలో చాలా మార్పులు వచ్చాయన్నారు హోంమంత్రి. ప్రతి సంవత్సరం డ్యూటీ మీట్‌ను నిర్వహిస్తామన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు