కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ఇది వరకే విద్యార్థులకు బ్యాగులు, యూనిఫారాలు, పుస్తకాలన్నింటినీ సరఫరా చేశామన్నారు. కడప కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా సమీక్ష సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడారు.
పారదర్శకంగా, నిజాయితీ, జవాబుదారీ తనంతో పని చేయాలనే.. జగన్మోహన్‌రెడ్డి ఆశయాలను అమలు చేయాలన్నారు. కడప జిల్లాలో 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 805 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు.