రెయిన్ అలెర్ట్ జారీ.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలు

శనివారం, 7 జనవరి 2023 (23:29 IST)
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రెండు దక్షిణ, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుంది వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
ఆంధ్రాలో, తెలంగాణలో పలు చోట్ల స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వచ్చే ఐదు రోజులు వాతావరణ పరిస్థితులు ఇలానే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
 
ఈ మేరకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం వర్షం పడటంతో.. డ్రైలైన్ షవర్స్ కారణంగా చలి తీవ్రత మరింత పెరగుతుందని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు