తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త - మూడు రోజులు తేలికపాటి వర్షాలు

మంగళవారం, 13 జూన్ 2023 (16:24 IST)
వచ్చే మూడు రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. 
 
గంటకు 30 - 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు. రాయలసీమ ప్రాంతంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 
 
పశ్చిమ దిక్కు నుంచే వీచే గాలులు తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకురాలు నాగరత్న తెలిపారు. రాబోయే మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆమె చెప్పారు. 
 
ఇవాళ రాష్ట్రంలో కొన్నిచోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్‌, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో ఇవాళ వడగాలులు వీచే అవకాశముందని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు