అమరావతిని మున్సిపాలిటీగా చేయడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గల ఉద్దేశం ఏంటో చెప్పాలని గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించబోమని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి గ్రామసభలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.
అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు ప్రతిపాదనపై మంగళగరి మండలం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం మల్కాపురం, వెలగపూడి, పెదపెరిగి గ్రామాల్లో శుక్రవారం అధికారులు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాజధానిలో లేని గ్రామాలను మున్సిపాలిటీలోకి ఎందుకు తేవాలనుకుంటున్నారు.. అని ప్రశ్నించారు.