ఎపి సిఎం జగన్ చేతిలో చంటిబిడ్డ, ఎవరు?

బుధవారం, 2 సెప్టెంబరు 2020 (22:44 IST)
కడప జిల్లా ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన తండ్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి కార్యక్రమానికి హాజరయ్యారు. తండ్రికి ఘన నివాళులు అర్పించారు సిఎం కుటుంబ సభ్యులు. జయంతి అయినా వర్థంతి అయినా ఇడుపులపాయకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన జ్యోతి అనే వైసిపి కార్యకర్త తన చేతిలోని చంటి బిడ్డను జగన్‌కు ఇచ్చారు. ఆ బిడ్డను చూసిన జగన్మోహన్ రెడ్డి కాసేపు మురిసిపోయారు. ఎంతో ముద్దుగా ఉండటంతో పేరు అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన సతమణి భారతి కూడా బిడ్డను ఆశీర్వదించారు. మీ ఆశీస్సులు నా బిడ్డకు శ్రీరామరక్ష అంటూ తల్లి జ్యోతి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
 
చంటిబిడ్డ సిఎం చేతిలో ఉండటాన్ని ఆసక్తిగా తిలకించారు వైసిపి కార్యకర్తలు, నాయకులు. గతంలో చిన్నపిల్లలను ఆప్యాయంగా ముద్దు పెట్టుకునే జగన్ ఈ సారి బిడ్డను చేతికి ఎత్తుకుని ఆశీర్వదిండంతో అందరూ ఆశ్చర్యంగా తిలకించారు. ముఖ్యమంత్రి అయినా కూడా జగన్ సాధారణంగానే ఉన్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు