సీబీఐ విచారణకు జగన్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? : టీడీపీ

బుధవారం, 16 డిశెంబరు 2020 (06:39 IST)
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై టీడీపీ సహా అన్ని రాజకీయపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈనెల4వ తేదీన శాసనమండలిలో టీడీపీసభ్యులు సలాం కుటుంబం ఆత్మహత్యల వ్యవహారంపై పెద్దఎత్తున ఆందోళనచేయడంపై సీబీఐ విచారణ జరిపేలా ముఖ్యమంత్రితో మాట్లాడతానని హోంమంత్రి సుచరిత హామీ ఇవ్వడంజరిగిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు.

మండలిలో హోంమంత్రి హామీ ఇచ్చి 10రోజులుదాటినా ప్రభుత్వంనుంచీ, ముఖ్యమంత్రి నుంచీ ఇంతవరకుస్పందన లేదన్నారు. ఆనాడు ప్రతిపక్షసభ్యుల నుంచి తప్పించుకోవడానికే హోంమంత్రి మండలిలో అబద్ధపు ప్రకటనచేశారనే అనుమానాలు తమకు కలుగతున్నాయని రఫీ స్పష్టంచేశారు. సలాం కుటుంబాన్ని దారుణంగా వేధించిన సీఐ, హె డ్ కానిస్టేబుళ్లను ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగాలనుంచి కూడా తొలగించలేదన్నారు.

వారు ప్రతిసారీ జైలుకువెళ్లడం, తిరిగిరావడం పరిపాటిగా మారిందన్న రఫీ, ప్రభుత్వం సదరు పోలీసులపై బలహీనమైన సెక్షన్లు పెట్టబట్టే వారు పదేపదే బయటకు వస్తున్నా రని చెప్పారు. సీఐ, హెడ్ కానిస్టేబుళ్లకు బెయిల్ వచ్చేలా వారికి పూచీకత్తుఇచ్చింది వైసీపీనేతలేనని, జరిగిన ఘటనలో స్థానిక ఎమ్మెల్యే పాత్రేమిటో, ఆయన అనుచరుల ప్రమేయమేమిటో తేల్చాల్సిన బాధ్యతప్రభుత్వంపై లేదా అని టీడీపీనేత నిలదీశారు.

అబ్దుల్ సలాంపై మోపబడిన బంగారం దొంగతనంకేసులో, అసలు దొంగలెవరు, దొంగిలించబడిన బంగారం ఎక్కడికెళ్లిందనే దిశగా పోలీసులు ఎందుకు విచారణ జరపలేదన్నారు. అబ్దుల్ సలాం, అతని కుటుంబం బతకడానికి భయపడే పరిస్థితులుకల్పించింది ఎవరో తేల్చకపోతే ఎలాగన్నారు. పోలీసులు, ఎమ్మెల్యే, అతని అనుచరుల వేధింపులవల్లే అబ్దుల్ సలాం కుటుంబంతోసహ  బలవన్మరణానికి పాల్పడ్ఢాడని రఫీ మండిపడ్డారు.

మండలిలో చెప్పినట్లుగా హోంమంత్రి ఎప్పుడు సీబీఐ విచారణకు ఆదేశిస్తారో, ముఖ్యమంత్రి నోటినుంచి ఆప్రకటన ఎప్పుడొస్తుందో చెప్పాలన్నా రు. అబ్దుల్ సలాం కుటుంబం మరణాలకు కారకులైనవారిపై శిక్షించడానికి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందన్నారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి ఏపీలో పోస్టింగ్ ఇవ్వడంపై చూపిన శ్రద్ధను, ఈప్రభుత్వం అబ్దుల్ సలాం కేసులో ఎందుకు చూపడంలేదని రఫీ నిలదీశారు. 

తక్షణమే ఏపీ ప్రభుత్వం అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు గలకారణాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన దారుణంపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడాన్ని రాష్ట్రంలోని ముస్లింలు, ముస్లిం సంఘాలన్నీ ఆక్షేపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వైఖరిచూస్తుంటే పలు అనుమానాలు కలుగుతున్నాయని, అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి మౌనంగా ఉండటం ఎంతమాత్రం సరైంది కాదని రఫీ తేల్చిచెప్పారు.

వీలైనంత త్వరగా ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని, ఘటనలో కీలకవ్యక్తులైన పోలీసులకు శిక్షపడేలా చూడాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నట్లు రఫీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు