నెల్లూరు జిల్లా మైపాడు గేటు ప్రాంతమది. రవి, ఈశ్వరమ్మలకు సంవత్సరం క్రితమే వివాహమైంది. ఇంకా పిల్లలు లేరు. రవి మేస్త్రీ పని చేసేవాడు. ఈశ్వరమ్మ ఇంటి పట్టునే ఉండేది. రవికి అనుమానం ఎక్కువ. తను పనికి వెళ్ళినప్పుడు భార్య ఎవరెవరితోనే కలుస్తోందని అనుమానం రవికి.