అధికార పార్టీ నేతలు దౌర్జన్యం, ఆక్రమణలకు పాల్పడడం వల్లే చివరకు ముంపుకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజకీయ నాయకుల గురించి తెలుసుకుంటే వర్షం కూడా ఆగదేమోనన్నారు నారాయణ. నష్టపరిహారం అందించడంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
900 మంది రైతులు చనిపోయాక బాద్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. దేశం ఆర్థిక తిరోగమనం చెందితే అంబానీ, అదాని ఎలా కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. మోడీపై వ్యతిరేకత ప్రజల్లో ఉందన్నారు. అఖిలేష్ యాదవ్‌ను ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.
స్వామినాథన్ రిపోర్ట్‌ను ఆమోదించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధలు విక్రయిస్తున్నారన్నారు. 300 కోట్ల రూపాయల విలువచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ 50 కోట్లకు విక్రయిస్తారా అంటూ ప్రశ్నించారు. 41 రక్షణ ఫ్యాక్టరీలు 7 కార్పొరేషన్లు చేసి విక్రయిస్తున్నారని.. 100 ఎయిర్ పోర్టులు కట్టి ఎయిరిండియాను విక్రయించారని విమర్సించారు.