ఆప్ఘాన్‌లో రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటానికి ముగింపుపలుకుతూ.. లక్షా 20 వేల మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనని, ఇందులో ఎలాంటి పొరపాటు లేదన్నారు.
ఈ బలగాల ఉపంసరణ నిర్ణయం తాను ఒక్కడినే తీసుకున్నది కాదన్నారు. దేశ ప్రజలు, మిలటరీ సలహాదారులు, యుద్ధభూమిలో ఉన్న సర్వీస్ చీఫ్‌లు, కమాండర్ల ఏకగ్రీవ సిఫారసుతోనే ఆప్ఘన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.
బలగాల తరలింపుపై అమెరికన్లకు తాను హామీ ఇచ్చానని, ఇప్పుడు దానిని నిలబెట్టుకున్నానని వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్‌తోపాటు ఇతర దేశాల్లో కూడా టెర్రరిజంపై అమెరికా పోరు కొనసాగుతుందని, అయితే అక్కడ అడుగుపెట్టకుండా ఈ పోరును కొనసాగిస్తామని స్పష్టం చేశారు.