డబ్బు కోసం పెడదారి పట్టే మహిళల సంఖ్య అధికమవుతోంది. డేటింగ్ సైట్లలో మోసానికి పాల్పడుతూ.. భారీ మొత్తాన్ని గుంజుకునే కిలాడీ లేడిగి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, చైతన్యపురికి చెందిన క్యూటీ (27) పలు పేర్లతో డేటింగ్ సైట్ల ద్వారా పురుషులతో చాటింగ్ చేసేది.
వారితో మాట కలిపి.. ఫోన్ నెంబర్ ఇచ్చి.. డేటింగ్‌కు వస్తానని కోరేది. మల్టీ ప్లెక్సుల్లో నాలుగు సినిమా టికెట్లు బుక్ చేయాలని కోరి, తన ఈ-మెయిల్ ఐడీని పంపేది. ఇలా నగరంలో హైటెక్ బడాబాబులను, సాఫ్ట్ వేర్లను ముంచింది. అంతటితో ఆగకుండా వారితో ఏర్పడిన పరిచయాన్ని కూడా క్యాష్ చేసుకునేది.