యలమంచిలికి మేకపాటి, విజయసాయి అభినందనలు

బుధవారం, 18 ఏప్రియల్ 2018 (21:46 IST)
విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కన్వీనర్ యలమంచిలి రవి బుధవారం పార్టీ అగ్ర నాయకులను కలిశారు. వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఇటీవల పార్టీలో చేరిన యలమంచిలి రవిని వెంటనే నియోజకవర్గ ఇంచార్జిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో బుధవారం వైసిపి నేతలను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
 
నేతలు విజయసాయి రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి తదితరులు ఈ సందర్భంగా యలమంచిలిని అభినందిస్తూ, మంచి నిర్ణయం తీసుకున్నారన్నారు. రవి రాకతో బెజవాడలో విభిన్న వర్గాలు వైసిపి వైపు చూస్తున్నాయని అభిప్రాయ పడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు