పుట్టినరోజు పార్టీకి రానన్నందుకు వైకాపా కార్పొరేటర్‌ని కారుతో తొక్కించి తొక్కించి హత్య

శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (19:34 IST)
కాకినాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యారు. కాకినాడలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధారాత్రి దాటిన తరువాత రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
 
సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనతో కాకినాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంపర రమేష్ తొమ్మిదో వార్డు కార్పొరేటర్. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయీ సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు.
 
ఇదివరకు ఆయన సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.1992లో ఎన్‌ఎస్‌యూఐ కాకినాడ నగర అధ్యక్షుడిగా, 1995లో తూర్పు గోదావరి జిల్లా యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షునిగా పని చేశారు. 2000లో కాకినాడ మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా కొనసాగారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వైసీపీలో చేరారు. వైఎస్ జగన్‌ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు.
 
అయితే నిన్న అర్థరాత్రి కాకినాడ రూరల్ గంగరాజునగర్, రోడ్డు నెంబరు 9 వద్ద ఉన్న సూర్య వాటర్ సర్వీసింగ్ సెంటర్ వద్ద ముత్యాల సతిష్, వాసుతో కంపరా రమేష్ మద్యం పార్టీ చేసుకుంటున్నాడు. అయితే కంపర రమేష్‌కి కాకినాడ ఎండోమెంట్ కాలనీకి చెందిన గురజాల చిన్న పలుమార్లు ఫోన్ చేయడంతో కంపరా రమేష్ ఫోను లిఫ్ట్ చేసి మద్యం పార్టీకి పిలవడంతో గురజాడ చిన్న, అతని సోదరుడు గురజాడ కుమార్ ఆ పార్టీకి వెళ్ళారు.
 
మద్యం పార్టీ అయిన తరువాత కంపరా రమేష్‌ని గురజాడ చిన్ని తన ఇంటిలో పుట్టినా రోజు వేడుకలు రమ్మని పిలిచాడు. ఐతే కంపరా రమేష్ రావడం కుదరదు అని చెప్పడంతో కోపంతో గురజాడ చిన్న కంపరా రమేష్‌ని పలుమార్లు కారుతో గుద్ది అక్కడ నుండి పరారయ్యాడు. తీవ్ర గాయాలతో ఉన్నా కంపరా రమేష్‌ను ట్రస్టు హాస్పిటల్‌కీ తరలించినా చికిత్స పొందుతూ మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాము అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు