ఏపీలో వైకాపా అక్రమ కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధం!!

వరుణ్

గురువారం, 27 జూన్ 2024 (11:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమించుకుని ఇష్టారాజ్యంగా, అక్రమంగా నిర్మించిన వైకాపా కార్యాలయాలను కూల్చివేసేందుకు ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది.

ఈ విషయాన్ని పసిగట్టిన వైకాపా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేతకు రంగం సిద్ధమైందని పిటిషనర్ హైకోర్టుకు తెలుపగా, ఇప్పుడు కూల్చివేయబోవడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. 
 
అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన కార్యాలయాలకు మాత్రమే అధికారులు నోటీసులు ఇచ్చారని ప్రభుత్వ అడ్వకేట్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాక కోర్టుకు సమర్పిస్తామన్నారు. అనుమతులు లేకుండా నిర్మించిన కార్యాలయాలకు మాత్రమే నోటీసులు ఇచ్చామని కోర్టుకు తెలిపారు.
 
దీంతో కోర్టు విచారణ గురువారానికి వాయిదా వేయగా, కార్యాలయాల కూల్చివేతపై గురువారం వరకు యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఇప్పటికే గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైకాపా నిర్మించిన కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేసిన విషయం తెల్సిందే. ఈ కార్యాలయం కూల్చివేతలో హైకోర్టు ఆదేశాల మేరకు అటు ప్రభుత్వం, ఇటు అధికారులు నడుచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు