ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తివాస్తవ విరుద్ధమన్నారు. తమ పాలన సరిగ్గా లేదు కాబట్టే, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
తమ పార్టీ అధినేత జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు కూడా అదే చేయబోతున్నారని అన్నారు. జగన్‌పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.