ఢిల్లీ మద్యం స్కామ్‌లో వైకాపాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అందులో ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
అలాగే, కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు.. కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా గురువారం విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని కోర్టుకు ఈడీ సమాచారం ఇచ్చింది.