తిరుపతి ఎంపీగా ప్రమాణం చేసిన వెంటనే సహచర ఎం పి ల తో కలసి తిరుపతి ఎం పి గురుమూర్తి వైస్సార్సీపీ అధ్యక్షులు, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యల పై పోరాటం మొదలు పెట్టారు.
పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ హక్కు అని, సవరించిన ప్రాజెక్ట్ అంచనాలను తక్షణం కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తిరుపతి ఎంపి ఎం. గురుమూర్తి లోక్ సభలో సహచర వైస్సార్సీపీ ఎంపీలతో కలసి నిరసన వ్యక్తం చేశారు. వెల్ లోకి దూసుకెళ్లి ప్లకార్డుల చూపుతూ ఆందోళన చేసారు.