కుప్పం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి అధికారపార్టీ వైసీపీ కేంద్రంగా కీలమైన డెవలప్‌మెంట్ జిల్లా రాజకీయాల్లో చర్చకు కారణమైంది. పంచాయతీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు టీడీపీ కంచుకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్‌లో వైసీపీ జెండా ఎగరేశారు. అక్కడితో సరిపెట్టుకోకుండా మరింత దూకుడుగా వెళ్లాలని డిసైడ్ అయ్యారని టాక్.
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రమౌళి అనారోగ్యంతో చనిపోవడంతో ఆ స్థానాన్ని ఆయన కుమారుడు భరత్‌కు అప్పగించారు. ఇప్పుడు భరత్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి.. కుప్పం కొత్త సారథి కోసం సీరియస్‌గా దృష్టి పెట్టారట. ఆ కొత్త సారథి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం నుంచే ఉంటారనే చర్చ పార్టీ వర్గాల్లో సంచలనంగా మారింది.