దుర్మార్గుల జాబితాలో జగన్ చేరి గుర్తుండిపోతారేమో : వైకాపా రెబెల్ ఎంపీ

మంగళవారం, 7 డిశెంబరు 2021 (16:36 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కొందరు దుర్మార్గుల జాబితాలో చేరి చరిత్రలో గుర్తుండిపోతారేమో అని ఆ పార్టీకి చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం రైతులు భూములిచ్చారని గుర్తుచేశారు. 
 
కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కో ఆఫీసును ఒక్కో ప్రాంతానికి తరలిస్తూ వస్తుందన్నారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే బూతులు తిడతారా అని ప్రశ్నించారు. పైగా, జగన్ దుర్మార్గుల జాబితాలో చేరారని ఆరోపించారు. అయితే, తాను మాత్రం వైకాపా ప్రభుత్వం, వైకాపా నేతల  దాష్టీకాల మీద పోరాటం చేస్తానని తెలిపారు 
 
ఇకపోతే, ఏపీలో ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దౌర్జన్యపూరితంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు జీతమిస్తున్నామని చెప్పి ఉద్యోగులకు జీతం ఇవ్వడం లేదని గుర్తుచేశారు. అలాగే, పాఠశాలల్లో ఆంగ్ల మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపు చర్యలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు ముఖ్యమంత్రి జగన్, కొందరు దుర్మార్గులతో చేరి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు