గుమ్మగట్ట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం, కేవలం వైసీపీ కార్యకర్తల వలనే జరిగిందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. అనంతపురం జిల్లా, కళ్యాణ దుర్గం నియోజకవర్గం, బ్రహ్మ సముద్రం మండలం, ముప్పులకుంట, కోడిపల్లి గ్రామాలకు చెందిన, ముగ్గురు తెలుగుదేశం కార్యకర్తలు సహా, రాయదుర్గం ప్రాంతానికి చెందిన మరో మగ్గురు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.
వైసీపీ వారు కావాలనే వాహనంతో ఢీకొట్టారని, ప్రమాదానికి కారణమైన వారిపై వెంటనే కేసు నమోదు చేయాలని రాయదుర్గంలో అనంత పార్లమెంట్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులు డిమాండు చేశారు. ఆయనతో పాటు ఆందోళనలో నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ దొడగట్ట నారాయణ, పట్టణ కన్వీనర్ మురళి, బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు, పార్లమెంట్ కమిటీ టీడీపీ కార్యదర్శి తలారి సత్తి, మాజీ మండల కన్వీనర్ మంజు, శివ, మాజీ ఎంపీటీసీ రవి, మాజీ సర్పంచ్ బసవరాజు తదితరులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.