వైకాపా ఢీ అంటే ఢీ అంటున్న జనసైనికులు.. తిరుపతికి వేదికగా స్టిక్కర్ వార్

ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (12:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా, విపక్ష జనసేన పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. తిరుపతి వేదికగా ఈ రెండు పార్టీల నేతలు స్టిక్కర్ల వార్‌కు దిగారు. వైకాపా నేతలు స్టిక్కర్లు అంటించిన చోట జనసేన స్టిక్కర్లను అంటిస్తున్నారు. సీఎం జగన్‌ పాలన, సంక్షేమ పథకాల అమలు తీరును జనంలోకి తీసుకెళుతున్న వైకాపా, ఇంటింటికి వెళ్లి మా నమ్మకం నవ్వు జగన్ నినాదంతో కూడిన స్టిక్కర్లను అంటిస్తుంది. సీఎం జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమల్లోకి వచ్చిన పథకాలను, అభివృద్ధిని జనాలకు వైకాపా నేతలు వివరించే ప్రయత్నం చేశారు. 
 
వైకాపాతో ఢీ అంటే ఢీ అంటున్న జనసేన ఇపుడిపుడే అంశంలో పోటీ కార్యక్రమం చేపట్టింది. వైకాపా నాయకులనే ఫాలో అవుతున్న జనసేన నేతలు వాళ్ళు స్టిక్కర్లు వేసిన చోట జనసేన స్టిక్కర్లను అంటిస్తున్నారు. మాకు నమ్మకం లేదు. మా నమ్మకం పవన్ అనే నినాదాలతో ఉన్న స్టిక్కర్లను ప్రతి ఇంటికి గోడకు అతికిస్తున్నారు. 
 
ఇపుడు రెండు పార్టీల తీరు తిరుపతి రాజకీయంగా దుమారం రేపుతోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో దేశానికి ఏపీ ఆందర్శంగా నిలిచిందని వైకాపా చెబుతుంటే నాలుగేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చలేదంటూ జనసేన ఆరోపిస్తుంది. 
 
జగన్‌పై నమ్మకం ఉందా అంటూ కనిపించిన వారినల్లా ప్రశ్నిస్తుంది. అయితే, జగన్‌పై నమ్మకం లేదంటే స్టిక్కర్లు వేస్తుంటే పోలీసులను బెదిరింపులకు దిగుతున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ స్టిక్కర్లు వార్ ఎంతవరకు వెళుతుంటే చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు