స్కూల్ ప్రాంగణంలో మద్యం బాటిళ్లు.. నాలుగో తరగతి అమ్మాయిపై..?

బుధవారం, 6 ఏప్రియల్ 2022 (17:24 IST)
విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. 
 
విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. 
 
ఈ ఘటనతో పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటేనే తల్లిదండ్రులు హడలెత్తి పోతున్నారు. అటుగా రోడ్డుపై వెళ్తున్న బాలికను బలవంతంగా పట్టుకొని స్కూల్ గోడపై నుండి లోపలికి పడవేశారు ఆకతాయిలు.
 
తర్వాత గంటపాటు ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు. ఆ చిన్నారి కేకలు వేయడంతో ఆ ఆకతాయిలు పారిపోయారు. అమ్మాయి బట్టలు చిరిగి ఉండటంతో గమనించి తల్లిదండ్రులు జరిగిన విషయం ఆరాతీశారు. 
 
అనంతరం ఘటనపై పోలీస్ లకు ఫిర్యాదు చేశారు. ఆకతాయిలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు