ఏపీలో ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగం!

శనివారం, 26 జూన్ 2021 (15:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. తద్వారా ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించేదీ ముందుగానే చెప్పటం ద్వారా నిరుద్యోగులు తమ ఉద్యోగాల కోసం సిద్దమయ్యే అవకాశం ఏర్పుడుతుందన్నారు. 
 
పరీక్షలు పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని, ఎటువంటి అవినీతి, సిఫార్సులకు అవకాశం ఉండదని స్పష్టం చేసారు. కేవలం రాత పరీక్షల ద్వారానే ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఇంటర్వ్యూ విధానం రద్దు చేసినట్లు వెల్లడించారు.
 
కాగా, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ 2021-22 జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాదిలో 10, 143 పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ఇప్పటివరకు 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేసామన్నారు. 
 
తొలి నాలుగు నెలల కాలంలోనే లక్షా 22 వేల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. 2.50 లక్షల మందిని సచివాలయల్లో వాలంటీర్లుగా నియమించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల కోరిక అంగీకరిస్తూ వారిని ప్రభుత్వంలో విలీనం చేసామని చెప్పారు. దీంతో 51,387 మంది ఆర్టీసీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు