వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండోరోజు పర్యటన

శుక్రవారం, 3 డిశెంబరు 2021 (11:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కూడా రెండో రోజు కూడా పర్యటిస్తున్నారు. తొలి రోజు కడప జిల్లాలో పర్యటించిన సీఎం రోజు కూడా తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. 
 
తిరుపతిలోని శ్రీకృష్ణానగర్‌లో వరద తీవ్రత తెలిపే ఫోటో దర్శననను ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా బాధితులతో నేరుగా మాట్లాడారు. వరద బాధితులకు నేనున్నాంటూ భరోసా కల్పించారు. తిరుపతి నగరంలోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. 
 
వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం బాధితులకు అందుబాటులో ఉండాలని అధికారులతో ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ వరద సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం జగన్ వెంట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన రెడ్డి, ఆర్కే రోజా, ఇతర అధికారులు ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు