వైకాపాలో అంతర్గతంగా పెను మార్పులు... సజ్జల - బుగ్గనకు ఉద్వాసన

గురువారం, 24 నవంబరు 2022 (08:58 IST)
వైకాపాలో అంతర్గతంగా పెను మార్పులు చోటుచేసుకున్నాయి. పార్టీలో పలు మార్పులు చేస్తూ ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సమన్వయకర్తలుగా ఉన్న సీనియర్ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లను తొలగించింది. వారు నిర్వహిస్తూ వచ్చిన జిల్లా సమన్వయకర్త బాధ్యతలను ఇతర నేతలకు అప్పగించింది. 
 
ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, అవంతి శ్రీనివాస్, సుచరిత, బుర్రా మధుసూదన్ యాదవ్, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించింది. మాజీ మంత్రి కొడాలి నానికి కూడా మొండి చేయి చూపించారు. అలాగే, సజ్జల, బుగ్గనలు సమన్వయం చేస్తూ వచ్చిన కర్నూలు, నంద్యాల బాధ్యతలను వైకాపా జడ్పీ ఛైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డికి అప్పగించింది. 
 
ఇప్పటివరకు అనిల్ కుమార్ యాదవ్ చూసుకున్న కడప, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించింది. బాలినేని విషయంలో మాత్రం మినహాయింపునిచ్చిన సీఎం జగన్... ఆయన ఇప్పటివరకు చూస్తున్న మూడు జిల్లాలతో పాటు నెల్లూరును కొనసాగించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు