ఏపీ సీఎం చంద్రబాబుపై వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. తన అధికారానికి అడ్డువస్తే ఎవరినైనా చంపించే వ్యక్తిత్వం చంద్రబాబుదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. స్వార్థం కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు దిగజారుతాడని జగన్ ఫైర్ అయ్యారు.
బాబుకు ఓటేస్తే హత్యా రాజకీయాలకు ఓటేసినట్టేనన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది చంద్రబాబేనని జగన్ ఆరోపించారు. ఇప్పుడు కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని జగన్ విమర్శించారు. తప్పు చేయకుంటే, హత్య వెనుక చంద్రబాబు పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.