Rana: దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే.. కాంత ఫస్ట్ సింగిల్ కు రెస్పాన్స్

చిత్రాసేన్

బుధవారం, 22 అక్టోబరు 2025 (12:12 IST)
Dulquer Salmaan, Bhagyashree Borse, Rana daggubati
దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ మూవీ కాంత టీజర్‌తో సంచలనం సృష్టించింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. సముద్రఖని కీలక పాత్ర పోషిస్తున్నారు.
 
స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాంత ఫస్ట్ సింగిల్ హే పసి మనసే కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
 
మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కాంత నవంబర్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.  దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని వింటేజ్ అండ్ ఇంటెన్స్ లుక్స్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా క్యురియాసిటీ పెంచింది.  
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ డానీ సాంచెజ్ లోపెజ్, ఆర్ట్ డైరెక్షన్‌ను థా. రామలింగం. అదనపు స్క్రీన్‌ప్లేను తమిళ్ ప్రభ ఇచ్చారు. లెవెలిన్ ఆంథోనీ గోన్సాల్వెస్ ఎడిటర్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు